గుడి జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది – అమర్ సింహా

అంకాల పరమేశ్వరి గుడి జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మాకినేని అమర్ సింహా అన్నారు.

అంకాల పరమేశ్వరి గుడి పై అక్రమార్కుల డేగా కన్ను అనే పొదిలి టైమ్స్ కధనాన్ని కి స్పందించినా భారతీయ జనతా పార్టీ పొదిలి మండల కమిటీ అధ్యక్షులు మాకినేని అమర్ సింహా సంబంధిత అంకాల పరమేశ్వరి గుడిని సందర్శించి స్థానికులకు సంఘీభావం ప్రకటించారు.

గుడి జోలికి వస్తే చూస్తు ఊరుకోమని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.

అవసరమైతే ఆమరణ దీక్షకు దిగుతానని ఆయన తెలిపారు.