మండల పరిషత్ అధ్యక్షుల ఫోరం జిల్లా అధ్యక్షులు గా వాకా ఎన్నిక
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
మండల పరిషత్ అధ్యక్షుల ఫోరం ప్రకాశం జిల్లా అధ్యక్షులు గా వాకా వెంకట రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్ మండల పరిషత్ అధ్యక్షుల ఫోరం ప్రకాశం జిల్లా సమావేశం ఆదివారం నాడు స్థానిక పొదిలి బి యల్ యన్ గ్రాండ్ హోటల్ నందు మర్రిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట రెడ్డి అధ్యక్షతనతో సమావేశంలో జరిగింది.
ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యక్షుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మేకల హనుమంతరావు యాదవ్ సమక్షంలో ప్రకాశం జిల్లా మండల పరిషత్ అధ్యక్షుల ఫోరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షులుగా మల్లిఖార్జున రెడ్డి (ఒంగోలు)అధ్యక్షులు వాకా వెంకట రెడ్డి(మర్రిపూడి) ఉపాధ్యక్షులు బుడంగుంట్ల విజయ, షేక్ ఖాసిం బి ప్రధాన కార్యదర్శి ఉషా మురళి కార్యదర్శి అరుణ్ రెడ్డి కట్టా శోభ రాణి కోశాధికారి కిరణ్ గౌడ్
రాష్ట్ర కమిటీ జఫాన్యా , యద్దనపూడి శ్రీనివాస్, సోరెడ్డి భూలక్ష్మి , న్యాయ విభాగం గాయం సావిత్రి
ఈ కార్యక్రమంలో కొత్తపట్నం మండల పరిషత్ అధ్యక్షులు లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు మండల పరిషత్ అధ్యక్షులు మల్లిఖార్జున రెడ్డి,బెస్తావారిపేట మండల పరిషత్ అధ్యక్షులు ఓసూర రెడ్డి, టంగుటూరు మండల పరిషత్ అధ్యక్షురాలు కోటేశ్వరమ్మ, దరిశి మండల పరిషత్ అధ్యక్షులు ప్రసంగించారు.
అనంతరం మాజీ సర్పంచ్ పెమ్మని ఓంకార్ యాదవ్, పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు మేకల హనుమంతరావు యాదవ్, వాకా వెంకట రెడ్డి లను ఘనంగా సత్కరించారు.