నాటుసారా అక్రమ మద్యం ధ్వంసం వాహనాలు వేలం

పొదిలి ఎస్ఇబి స్టేషన్ నందు వివిధ కేసుల్లో పట్టుబడ్డ 312 లీటర్ల నాటుసారా,120 లిక్కర్ బాటిల్స్ మార్కాపురం డిఎస్పీ ఎ.శ్రీనివాసుల నాయుడు ఆద్వర్యంలో ధ్వంసం చేసారు

అక్రమ మద్యం,నాటుసారా ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని నాటుసారా తయాదారులకు బెల్లం అమ్మిన కేసులు నమోదు చేస్తామని డిఎస్పీ శ్రీనివాసుల నాయుడు హెచ్చరించారు.._

అలాగే వివిధ కేసుల్లో పట్టుబడ్డ 7 బైక్ లు,ఒక కారు వేలం పాట నిర్వహించడం ద్వారా 1లక్ష డెబ్బైవేల ఎనిమిది వందల రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సి.ఐ ఖాజామోహిద్దిన్, ఎస్సై రాజేంద్రప్రసాద్,హెడ్ కానిస్టేబుల్ ఎమ్‌డి.ఖాశీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.