కొనకనమిట్ల మండలంలో కుందూరు విస్తృత పర్యటన పలు భవనాలు ప్రారంభోత్సవం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

కొనకనమిట్ల మండలంలో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి విస్తృతంగా పర్యటించి పలు భవనాలను ప్రారంభించారు.

శుక్రవారం నాడు స్థానిక కొనకనమిట్ల మండలం రేగమనుపల్లి , సిద్దవరం , చిన్న అరికట్ల గ్రామంలోని గ్రామ సచివాలయలు,రైతు భరోసా కేంద్రాలను శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి, మండల పరిషత్ అధ్యక్షులు మూరబోయిన మురళి కృష్ణ యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు శంకర్ రెడ్డి మరియు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు మరియు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు