ఆర్టీసీ సిఐ రమణమ్మ కు ఘనంగా వీడ్కోలు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

ఆర్టీసీ సిఐ రమణమ్మ కు ఘనంగా వీడ్కోలు పలికారు.

వివరాల్లోకి పొదిలి ఆర్టీసీ డిపో నందు సిఐ పని చేస్తున్న రమణమ్మ సాధారణ బదిలీల్లో భాగం కనిగిరి డిపో కు బదిలీ కాగా శనివారం నాడు ఆర్టీసీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రమణమ్మ ను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ పనిచేసే కాలంలో పొదిలి డిపొను అభివృద్ధి పథంలో నడిపిస్తు ఇపికె లో జిల్లాలో ప్రధమ స్థానంలొ నిలబెట్టారు…ఒకటవ నెంబర్ ప్లాట్ ఫాం వద్ద నుంచి షెడ్ నిర్మాణం..సి.సి రొడ్డు వేపించటం…మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలలో విశేష కృషి చేసారని అన్నారు.

ప్రయాణికుల అభిమానమే కాక కార్మికుల అభిమానం కుడా కుడగట్టుకున్నారని ఎక్కడ పనిచేసినా తనదైన ప్రత్యేక శైలిలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారని పొదిలి ఆర్టీసీ డిఎం సుందరరావు అభినందించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి ఆర్టీసీ డిపో మేనేజర్ సుందరరావు మరియు ఉద్యోగుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు