వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కుందూరు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే ఆదివారం నాడు స్థానిక దరిశి రోడ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని లాంఛనంగా శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసులురెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి, పట్టణ అధ్యక్షులు షేక్ నూర్జహాన్, పట్టణ మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు