పొదిలిలోడోర్ డెలివరీ ప్రచార మాసోత్సవం ర్యాలీ

డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవం సందర్భంగా స్థానిక పొదిలి ఆర్టీసీ గ్యారెజీ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ చూట్టు ర్యాలీ నిర్వహించారు.

ప్రజా రవాణా సంస్థ ద్వారా కొరియర్‌, సరుకు రవాణాను సమర్థవంతంగా వినియోగదారుల ఇంటికే చేరవేరుస్తున్నట్లు పొదిలి ఆర్టీసీ డిపో మేనేజర్ సుందరరావు అన్నారు.

ప్రజల్లో నమ్మకాన్ని పెంచడానికి ఈనెల 25 నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు ప్రచార మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

2017లో పార్సిల్‌ లాజిస్టిక్‌ వ్యాపారం ప్రారంభమైందని ప్రజల నమ్మకాన్ని చూరగొని అభివృద్ధి సాధిస్తున్నామన్నారు.

 

కార్యక్రమంలో సహాయక మేనేజర్లు ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.