బిసి హాస్టల్ లో విజిలెన్స్ అధికారులు తనిఖీ

పొదిలి పట్టణంలోని వెనుకబడిన తరగతుల హాస్టల్ నందు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే గురువారం ఉదయం స్థానిక విశ్వనాథపురంలోని వెనుకబడిన తరగతుల వసతి గృహం నందు విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ యస్ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని తనిఖీలు నిర్వహించి బియ్యం, కందిపప్పు,నునె, మొదలైన సరుకులను మరియు విద్యార్థుల హజరుపట్టిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు .

ఈ కార్యక్రమంలో విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు