ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న వైసిపి ప్రభుత్వం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
అధికార వైసీపీ ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుండడంపై పొదిలి మండల తెలుగు దేశం పార్టీ నాయకులు మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం నందు వినతిపత్రాన్ని అందజేశి నిరసనలు తెలిపారు.
రెవెన్యూ కార్యాలయానికి ప్ర దర్శనగా వెళ్లి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చే శారు. రెవిన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. రేషన్ బియ్యం పంపిణీలో మోసం, రేషన్కార్డుల తొల గింపు, నాణ్యతలేని వస్తువుల పంపిణీ, రేషన్షాపుల్లో ఇచ్చే కందిపప్పు, పంచదార ధరల పెంపు, కేంద్ర ప్ర భుత్వం ఇచ్చే ఉచిత బియ్యంను దాచుకుంటున్న వైనంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్, పార్లమెంట్ కమిటీ కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా మాజీ అధ్యక్షులు సామంతపుడి నాగేశ్వరరావు , మాజీ సర్పంచ్ కాటూరి నారాయణ ప్రతాప్, మండల,పట్టణ పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి ముల్లా ఖూద్దుస్ స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకులు షేక్ షబ్బీర్, షేక్ మస్తాన్ వలి, జ్యోతి మల్లి నరసింహారావు, షేక్ గౌస్ భాష, ముని శ్రీనివాస్, కాటూరి శ్రీను, తదితరులు పాల్గొన్నారు