పోస్టు ఆఫీసు నందు జాతీయ జెండాల అమ్మకాలు ప్రారంభం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అజాద్ కి అమృత మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఆగస్టు 13వ,14వ,15వ తేదీల్లో హర్ ఘర్ తిరంగ (ప్రతి ఇంటి పై జాతీయ జెండా) కార్యక్రమాన్ని భారత కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.

అందులో భాగంగా దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీసులో జాతీయ జెండాల అమ్మకాలను ప్రారంభించారు. అందులో భాగంగా పొదిలి హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు జాతీయ జెండాల అమ్మకాలను పోస్ట్ ఆఫీస్ మేనేజర్ నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి టైమ్స్ ఎడిటర్ మందగిరి వెంకటేష్ యాదవ్ పోస్ట్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు