మర్రిపూడిలో ఉరేసుకొని వృద్దుడు మృతి
మర్రిపూడి మండల కేంద్రంలో ఉరేసుకొని వృద్దుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే మర్రిపూడి గ్రామ శివారులో ఉన్న ప్రైవేట్ సంస్థకు చెందిన టవర్ కు ఉదయగిరి వెంకట సుబ్బయ్య (62) ఉరి వేసుకొని మృతి చెందిన సంఘటన బుధవారం నాడు వెలుగులోకి వచ్చింది.
విషయం తెలుసుకున్న మర్రిపూడి యస్ఐ అంకామ్మరావు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని దించి పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
పోలీసుల కథనం మేరకు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు కారణం తో ఆత్మహత్యకు పాల్పడ్డాడని దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు