పంచాయితీ కార్యదర్శి చేసిన అనుచిత వ్యాఖ్యల కు ఆమరణ నిరాహరదీక్ష కు దిగిన అమర్ సింహా
పొదిలి గ్రామం పంచాయతీ కార్యదర్శి కాటూరి వెంకటేశ్వర్లు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన గా పంచాయతీ కార్యలయం ముందు భారత్ పెట్రోల్ బంక్ యాజమాని మాకినేని అమర్ సింహా ఆమారణ దీక్ష ను బుధవారం సాయంత్రం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదిలి గ్రామ పంచాయతీ పరిధి లోని స్ధానిక విశ్వనాథపురం నిర్మల కాన్వెంట్ వద్ద గల పొదిలి – పెదరికట్ల రహాదారి లో ఆక్రమ నిర్మాణలు చేపట్టారని దాని పై ఈ నెల 11వ తేది జన్మభూమి నందు ఫిర్యాదు చేసానని, దాని పై చర్యలు తీసుకొవాలని పంచాయతీ కార్యదర్శి వారికి కూడా పిర్యాదు చేసానని సదరు ఆక్రమ నిర్మాణం జరగుతున్న భూమి పై 2013 లో ఆక్రమ కట్టడలపై తోలగించమని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందిని, అప్పుడు పంచాయతీ కార్యదర్శి ఆక్రమ కట్టడలు తొలగించారని ప్రస్తుతం అదే భూమి లో మరలా ఆక్రమ కట్టడములు నిర్మించటం పై పంచాయతీ కార్యదర్శి దగ్గర కు బుధవారం సాయంత్రం వెళ్ళి అడగ్గ పంచాయతీ కార్యదర్శి తనపై అనిచిత వ్యాఖ్యలు చేస్తు దురసుగా ప్రవర్తిచాండని ,దానికి నిరసన గా ఆక్రమ కట్టడలు తొలగించే దాక, నాకు న్యాయం చేశేదాక, నేను ఆమరణ దీక్ష చేస్తానని ఆయన తెలిపారు