లోక్ అదాలత్ లో 298 కేసులు రాజీ
జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా పొదిలి మండల న్యాయ సేవాధికార సంస్ధ మరియు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వారి ఆధ్వర్యంలో స్ధానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు శనివారం జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో క్రిమినల్ కేసులు –74 సివిల్ కేసులు 05 పరిష్కార మొత్తం 8లక్షల 40వేల రూపాయలు ,గృహ హింస కేసులు – 01, యస్టీసి కేసులు – 150, మొత్తం – 298కేసులు పరిష్కారం జరిగాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి యస్ భార్గవి మాట్లాడుతూ లోక్ అదాలత్ లో కేసులు రాజీ చేసుకోవడం ద్వారా సమయం మరియు డబ్బు ఆదా అవుతాయని గ్రామాలలో శాంతి ఉన్నప్పుడే దేశం అభివృద్ది చెందుతుందని మరియు బంధాలు పెంపొందుతాయని కావున కక్షిదారులు తమ కేసులు రాజీ చేసుకోవడానికి లోక్ అదాలత్ ఒక మంచి అవకాశమని అన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీసులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.