ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి పట్టణం నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.

స్థానిక శ్రీ కృష్ణ గోసంరక్షణ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక దరిశి రోడ్ లోని గోశాల నందు ప్రత్యేక పూజలు, గో తులాభారం, అన్నదానం, ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు.

స్థానిక పొదిలమ్మ నగర్ నందు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేక్ ను కోసి పంచిపెట్టారు.

పట్టణం లోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానం , వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ గోసంరక్షణ సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు యాదల వెంకట మోహన్ రావు, మద్దాళి కేశవరావు, ఆఖిల భారత యాదవ మహాసభ నాయకులు పొల్లా నరసింహా యాదవ్,మూరబోయిన బాబురావు యాదవ్ , కనకం వెంకట్రావు యాదవ్, శిరిమల్లే శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు