మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహం ఆవిష్కరణ

ప్రకాశం జిల్లా పొదిలి గ్రామీణ నీటి సరఫరా (ప్రాజెక్టు) ఈఈ కార్యలయం నందు శుక్రవారం ఉదయం భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహంని యస్ఇ పి సంజీవరెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క ఇంజనీర్ విశ్వేశ్వరయ్య ను ఆదర్శంగా తీసుకొని మన చేసే ప్రతి పనిలో సృజనత్మకంగా ఉండలని అన్నారు ఈఈ బి మల్లిఖర్జునరావు మాట్లాడుతూ మోక్షంగుండం విశ్వేశ్వరయ్య స్వంత గ్రామం మన జిల్లా లోని బెస్తావారిపేట మండలం లో మోక్షంగుండం గ్రామం లో మన ప్రాజెక్ట్ ద్వారా ఆ యొక్క గ్రామంలో ప్రతి ఇంటికి మంచి నీటి కలేక్షన్ల్ ఇచ్చామని ప్రతి ఒక్క ఇంజనీర్ ఆయన యొక్క ఆలోచన విధానం పట్ల అవగాతం చేసుకొని ఉన్నతప్రామణలు తో సేవలు చేయలని ఆయన అన్నారు ఈ కార్యక్రమం లో గొట్టిపాటి మహేష్ ఒంగోలు ఈఈ షేక్ మస్తాన్ అలీ క్యూసి డిఇ యోగేశ్వరబాబు డిఇ బి శ్రీనివాసులు బాలకృష్ణ రెడ్డి కనకం నారయణస్వామి నరసింహరావు రంగరావు షేక్ జిలానీ రఫీ ప్రస్నలక్ష్మి మండ్లమురి శ్రీకాంత్ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు