3వ 4వ వార్డులో బాదుడే- బాదుడు కార్యక్రమానికి విశేష స్పందన
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి నగర పంచాయితీ పరిధిలోని 3వ,4వ వార్డులో తెలుగు యువత మండల అధ్యక్షులు పొపురి నరేష్ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం కు విశేష స్పందన లభించింది.
స్థానిక ఆంజనేయస్వామి దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కాటూరి వారి పాలెం నందు ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు
ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలపై రకరకాల పన్నుల రూపంలో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
గత ఎన్నికల ముందు ఒక అవకాశం ఇవ్వండి అని ప్రజలను ప్రాధేయపడీ అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులను, ఉద్యోగస్తులను, విద్యార్థులను రైతులను అన్ని వర్గాలు కులాల వారిని ఇబ్బంది పెడుతూ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు.
మార్కాపురం జిల్లా సాధన కోసం రెండు నెలలు తెలుగుదేశం ఆధ్వర్యంలో వివిధ రకాల పోరాటం చేశాము అని కానీ జిల్లాల పునర్విభజనలో మార్కాపురం జిల్లా ఇవ్వకుండా ఈ ప్రాంత లోని అన్ని వర్గాల వారిని మోసం చేశారని వాపోయారు.
ఇక్కడ వైసిపి నాయకులు ఎక్కడ ఈ ప్రాంతం లో భూమి కనబడిన వెంటనే బోర్డు పెట్టేస్తున్నారు అని కబ్జాదారుల గా మారి ప్రజలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు అని ప్రజలు ఇకనైనా కళ్ళు తెరచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకులకు బుద్ది చెప్పి తెలుగుదేశం పార్టీ ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి పొల్లా నరసింహ యాదవ్ పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రసూల్, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి యలమంద, మాజీ జెడ్పీటీసీ సభ్యులు కాటూరి వెంకట నారాయణ బాబు మాజీ సర్పంచ్ లు కాటూరి నారాయణ ప్రతాప్, కాటూరి నారాయణరావు, స్వర్ణ గీత పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ చప్పిడి రామలింగయ్య, తెలుగు దేశం పార్టీ బిసి సెల్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కనకం వెంకట్రావు యాదవ్,టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనిల్, రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి శోభ రాణి, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ బాష, జిల్లా తెలుగు మహిళ షేక్ షెహనాజ్,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు , ఎస్ ఎమ్ భాష, పొదిలి పట్టణ ప్రధాన కార్యదర్శి కాటూరి శ్రీనివాసులు, పొదిలి మండల తెలుగు యువత అధ్యక్షులు పోపూరి నరేష్, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు నారాయణ,ఒంగోలు పార్లమెంటు లీగల్ సెల్ అధికార ప్రతినిధి షేక్ షబ్బీర్,పార్లమెంట్ తెలుగు యువత దామిరెడ్డి అంజి రెడ్డి,మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి పట్టణ అధ్యక్షులు ముల్లా ఖూద్దుస్,మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలీ, ఎస్సీ సెల్ నాయకులు ఎర్రగుంట్ల నాగేశ్వరరావు, తెలుగుదేశం నాయకులు షేక్ మౌలాలి, మాజీ ఎంపీటీసీ నరసింహారావు,రమణ,ముల్లా ఖయ్యుమ్,బొడ్డు సుబ్బయ్య, కాటూరి హనుమంతరావు, రాజుపాలెం ప్రసాద్ ముని శ్రీను, షేక్ ఖాసిం, సంజీవ్,కుంచాల శ్రీను వెంకట్రావు, రావిపాటి అంజి,తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు