టిడిపి న్యాయ విభాగం రాష్ట్ర కార్యదర్శి గా యస్ ఎం బాషా నియామకం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
తెలుగు దేశం పార్టీ న్యాయ విభాగం రాష్ట్ర కార్యదర్శి గా షేక్ మహబూబ్ బాషా (యస్ ఎం భాషా) ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలుగు దేశం పార్టీ లో చూరుకైన కార్యకర్తగా పనిచేస్తున్న యస్ ఎం భాషా 2014 సంవత్సరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పొదిలి జెడ్పీటీసీ గా పోటీ చేసి ఓటమి చవిచూసారు.
తాను ఓటమి చవిచూసిన నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పొదిలి ప్రాంతంలో పార్టీ కార్యకర్తలకు న్యాయ సహాయం చేస్తు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
చురుకైన పాత్ర పోషిస్తున్నా యస్ ఎం భాషా కు రాష్ట్ర న్యాయ విభాగ కార్యదర్శిగా ఎంపిక చెయ్యడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు
తనకు పదవి లభించటకు కృషి చేసిన మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీ లకు కృతజ్ఞతలు తెలిపారు