తహశీల్దారును సత్కరించిన రెవెన్యూ సిబ్బంది
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి మండల రెవెన్యూ డిప్యూటీ తహశీల్దార్ భాగ్యలక్ష్మి ను పూర్తి స్థాయి తహశీల్దారు గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో రెవెన్యూ సిబ్బంది ఘనంగా సత్కరించారు.
శుక్రవారం నాడు స్థానిక మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం నందు తహశీల్దారు గా బాధ్యతలు చేపట్టిన భాగ్యలక్ష్మి ను మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం సిబ్బంది ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ డి బ్రహ్మం, జె.ఏ రాజ శేఖర్, గ్రామ రెవెన్యూ అధికారులు కె సుబ్బారావు, షేక్ అబ్దుల్ రహిమాన్, షబ్బిర్, నారాయణ, దుర్గ ప్రసాద్, బాల వెంకట రెడ్డి, పూజిత, యాకోబు, నాగేశ్వరరావు, మురళి, కంప్యూటర్ ఆపరేటర్ ప్రసాద్ మరియు గ్రామ సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.