ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించిన సిఐ సుధాకర్ రావు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పరిమితి మించి ద్విచక్ర వాహనాల ప్రయాణం చేస్తున్న వారికి పొదిలి సిఐ సుధాకర్ రావు అవగాహన కల్పించారు.
శనివారం నాడు స్థానిక కొనకనమిట్ల మండలం చిన్న అరికట్ల క్రాస్ రోడ్ నందు ద్విచక్ర వాహనాల పై పరిమితి మించి ప్రయాణం చేస్తున్న వారిని నిలిపి వారి అందరికి ద్విచక్ర వాహనాల పై ఇద్దరికీ కంటే ఎక్కువ మంది ప్రయాణం చేయకూడదని అదే విధంగా హెల్మెట్ తప్పని సరిగా ధరించాలని లేకపోతే జరిమానా జైలు తప్పదని హెచ్చరించారు.
ద్విచక్ర వాహనదారులు రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు అనుసరించ వలసిన ప్రభుత్వం నియమ నిబంధనల గురించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కొనకనమిట్ల యస్ఐ ఫణి కుమార్, పోలీసులు ద్విచక్ర వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.