ఎంపిపి పాదయాత్రకు సంఘీభావం తెలిపిన మీడియా ప్రతినిధులు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
కొనకనమిట్ల మండల పరిషత్ అధ్యక్షులు మూరబోయిన మురళి కృష్ణ యాదవ్ పాదయాత్ర కు కొనకనమిట్ల మండల మీడియా ప్రతినిధులు సంఘీభావం తెలిపారు.
చిన్న అరికట్ల నుంచి తిరుమల వరకు తలపెట్టిన పాదయాత్ర శనివారం నాటికి ఎనిమిదో రోజు చేరుకుంది.
తిరుపతి సమీపంలోని ఏర్పేడు పట్టణం నందు కొనకనమిట్ల మండలం కు చెందిన మీడియా ప్రతినిధులు కలసి సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరుగిరి కోటేశ్వరరావు, వెంకట్రావు యాదవ్, మీడియా ప్రతినిధులు కొండయ్య, బాల నర్సయ్య, నాగం వెంకటేశ్వర్లు, ఎజే రెడ్డి తదితరులు పాల్గొన్నారు