యాదవ సమస్యల పై 22వ తేది తహాశీల్ధార్ కార్యలయముల ముందు దర్నా కార్యక్రమం ని జయప్రదం చేయండి అఖిల భరత యాదవ మహసభ జిల్లా అధ్యక్షులు బోట్ల రామరావు యాదవ్

యాదవ సమస్యలు పరిష్కారం సాధన కోరకు ఈ నెల 22వ తేది సోమవారం నాడు జిల్లా లోని 56 మండల తహాశీల్ధార్ కార్యలయముల ముందు అఖిల భరత యాదవ మహసభ
ఆద్వర్యం లో ధర్నా కార్యక్రమంని జయప్రదం చేయలని పొదిలి రోడ్లు భవనాల అతిధి గృహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు బోట్ల రామరావు పిలుపునిచ్చారు తక్షణమే యాదవ కార్పొరేషన్ ఏర్పాట్లు చేసి ప్రతి ఏటా 2500 కోట్లు రూపాయలు పేద యాదవులు కోసం ఖర్చు చేయలని తిరుమల లో సన్నిధి గొల్ల హక్కు ను వంశపారంపర్యంగా కొనసాగిస్తూ ప్రత్యేక జి ఓ ను విడుదల చేయలని తెలంగాణ రాష్ట్రం మాదిరిగా 75 శాతం సబ్సిడీ తో గొర్రెలు – మేకల యూనిట్లు మంజూరు చేయలని ప్రతి రెవిన్యూ గ్రామం లో గొర్లు మేకలు మేపుకొనేందుకు 10 ఎకరాల భూమి ని కేటాయించాలని ఇప్పటికే ఉన్న పశువుల మేత బీడు లను ఆక్రమణదారుల చె‌ర నుండి విడిపించాలని జిల్లా లో పొదిలి గిద్దలూరు మార్కపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు యాదవులకు కేటాయించాలని ఆయన అన్నారు ఈ సమావేశంలో జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు పోల్లా నరసింహ యాదవ్ ఒంగోలు నగర కమిటీ అధ్యక్షులు తానికొండ సురేష్ యాదవ్ యాదవ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు పిన్నిక శ్రీనివాస్ పొదిలి మండల యాదవమహసభ నాయకులు నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్ యార్రమూడీ వెంకట్రావ్ యాదవ్ చిట్టిబోయన విజయ్ కుమార్ యాదవ్
బండరు శివకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు