వైయస్సార్ చేయూత మూడో విడత సంబరాలు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
వైయస్సార్ చేయూత మూడో విడత సంబరాలు కార్యక్రమాన్ని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు నిర్వహించారు.
బుధవారం నాడు స్థానిక పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన వైఎస్సార్ చేయూత మూడో విడత సంబరాలు లో స్థానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.
శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి చేతుల మీదుగా 5కోట్ల21లక్షల81వేల250రూపాయల విలువైన చెక్కలను పంపిణీ చేశారు.
అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీకృష్ణ, ఈఓఆర్డీ రాజశేఖర్, సోసైటీ ఛైర్మన్ కొత్తపులి బ్రహ్మ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి,. పట్టణ అధ్యక్షురాలు షేక్ నూర్జహాన్, మాజీ సర్పంచ్ పులగోర్ల శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులు మరియు
పెద్ద ఎత్తున మహిళా తదితరులు పాల్గొన్నారు