బి పి మండల్ విగ్రహానికి అనుమతి ఇవ్వాలి టిడిపి సోషల్ మీడియా కోఆర్డినేటర్ కనకం డిమాండ్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
బిసి వర్గాలకు రిజర్వేషన్లు కల్పంచిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీరేంద్ర ప్రసాద్ మండల్ విగ్రహా ప్రతిష్టకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని తెలుగు దేశం పార్టీ బిసి సెల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కనకం వెంకట్రావు యాదవ్ డిమాండ్ చేశారు.
గుంటూరు నందు సెప్టెంబర్ 25వ శంఖుస్థాపన జరిగిందని అయితే ఎటువంటి నోటీసు లేకుండా గుంటూరు కార్పొరేషన్ అధికారులు విగ్రహ పీఠాన్ని కూల్చివేశారని ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
బి పి మండల్ విగ్రహా పీఠాన్ని కూల్చివేసిన చోటనే తిరిగి శంఖుస్థాపన చేసుకోనేందుకు అనుమతి మంజూరు చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు.