ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్టు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి పట్టణం నందు కోత ముక్క ఆడుతున్న ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్టు చేసినట్లు యస్ఐ శ్రీహరి ఆదివారం నాడు ఒక ప్రకటన లో చేశారు.
రాబడిన సమాచారం మేరకు స్థానిక టైలర్స్ కాలనీ నందు డబ్బు పందెం గా పెట్టి కోత ముక్క ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 5270 రూపాయలు నగదు ఐదు సెల్ ఫోన్లు, పేకలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు యస్ఐ శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు