పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి షేక్ జైనులాబ్దిన్ పరిశీలించారు.
బుధవారం నాడు స్థానిక తలమల్ల రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి రైతుల సందేహాలను నివృత్తి చేసారు.
అనంతరం రైతులతో కలిసి పొలాల్లో కంది పంటను పరిశీలించి ఏ దశలో పురుగు మందు వాడాలి ఎంత వాడాలి అనే విషయాలు తెలియజేసారు.
సుడిగాలి దోమ నివారణకు కోసం రైతులు చేయ్యవలసిన పిచికారి గురించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకాలు అమృత కళ గ్రామ పంచాయతీ సర్పంచ్, రైతులు తదితరులు పాల్గొన్నారు