పంచాయతీ కార్యదర్శుల నూతన కార్యవర్గం ఎన్నిక
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ప్రకాశం జిల్లా పంచాయతీ కార్యదర్శుల సమావేశం పంచాయతీ కార్యదర్శి శేషగిరిరావు అధ్యక్షతన జరిగింది.
గురువారం నాడు స్థానిక పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు ప్రకాశం జిల్లా స్థాయి పంచాయతీ కార్యదర్శుల సమావేశం నిర్వహించి ఒంగోలు, కనిగిరి, మార్కాపురం డివిజన్ స్థాయిలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసారు.
ఒంగోలు డివిజన్ త్రీ సభ్య కమిటీ
1. యస్ మారుతి బాబు
2. యన్ ప్రసన్నకుమార్
3. మన్నం గణేష్ బాబు
కనిగిరి డివిజన్ త్రీ సభ్య కమిటీ
1. పి నాగరాజు
2. జి బాబు
3. సిహెచ్ టి నారాయణ
మార్కాపురం త్రీ సభ్య కమిటీ
1. డి వెంకటేశ్వర్లు
2. ఐ అంజి రెడ్డి
3. యన్ శివ కోటేశ్వరరావు
త్రీ సభ్య కమిటీ సభ్యులు ఈ నెల 29వ తేదీ లోపు డివిజన్ స్థాయిలో పంచాయతీ కార్యదర్శుల నూతన కమిటీ ఏర్పాటు చేసి అనంతరం జిల్లా కమిటీ ఎన్నిక జరిగే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు పంచాయతీ కార్యదర్శుల సంఘం ఒక ప్రకటనలో తెలిపారు.