మర్రిపూడి మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన
చిపూడి,అంకెపల్లి ,మర్రిపూడి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.
శుక్రవారం నాడు స్థానిక కూచిపూడి, అంకెపల్లి,మర్రిపూడి గ్రామాల్లో పర్యటించి జగనన్న లేఔట్లు నందు ఇంటి నిర్మాణం పనులు ప్రగతి గురించి సమీక్షించారు.
పశుమేత భూములను ఆక్రమించి సాగు చేస్తున్నారని స్ధానికులు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ దృష్టికి తీసుకొని వచ్చారు అదే అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ మొదలైన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్ళగా ఆయన సానుకూలంగా స్పందించి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం మర్రిపూడి జూనియర్ కళాశాల సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట్ రెడ్డి మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు