చెరువు కట్ట కింద రోడ్డు ను పరిశీలించిన ఆర్&బి యస్ సి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
మర్రిపూడి మండల కేంద్రంలోని చెరువు కట్ట కింద రోడ్డు ప్రక్కన ఉన్న కోనేటి బావి ని రోడ్లు భవనాలు శాఖ యస్ సి శివప్రసాద్ రెడ్డి పరిశీలించారు.
శనివారం నాడు స్థానిక మర్రిపూడి మండల పర్యటనలో భాగంగా విచ్చేసిన యస్ ఈ శివప్రసాద్ రెడ్డి కి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికి ప్రమాదకరమైన కోనేటి బావిని పరిశీలించి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మరియు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు