శవంతో రోడ్డు పై బైఠాయించిన కందుల

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

పొదిలి పట్టణం దరిశి రోడ్ లోని రధం సెంటర్లో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

ఆదివారం నాడు స్థానిక కొనకనమిట్ల మండలం సిద్దవరం గ్రామంలో నందు విద్యుత్ ఘాతుకానికి రోషన్ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

సోమవారం నాడు సదరు బాలుడు కి పొదిలి ప్రభుత్వ వైద్యశాల నందు పోస్టుమార్టం నిర్వహించారు.

పోస్టుమార్టం అనంతరం మృతదేహాంతో రథం సెంటర్లో రోడ్ నందు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బైఠాయించారు.

ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారుల‌ నిర్లక్ష్యం కారణంగా బాలుడు మృతి చెందారని సదరు బాలుడు కుటుంబానికి 20 లక్షల రూపాయలు నష్టపరిహారం కుటుంబంలో ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విషయం తెలుసుకున్న పొదిలి యస్ ఐ శ్రీహరి సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులు తో చర్చలు జరిపి రాస్తారోకో ను విరమింపజేశారు.

రెండో గంటల పాటు జరిగిన రాస్తారోకో తో భారీ గా నిలిచిన ట్రాఫిక్ ను పోలీసులు క్రమబద్ధీకరణ చేసారు.

ఈ కార్యక్రమంలో కొనకనమిట్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ పొదిలి పట్టణ అధ్యక్షులు ముల్లా ఖూద్దుస్, విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి షేక్ గౌస్ భాష, తెలుగు దేశం పార్టీ నాయకులు నరసింహారావు కాటూరి శ్రీను, బోడ్డు సుబ్బయ్య, తెలుగు యువత మండల అధ్యక్షులు నరేష్ మహమ్మద్, తదితరులు పాల్గొన్నారు