ఇంటి నిర్మాణం పనులు వేగవంతం కోసం ప్రత్యేక సమావేశం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి మున్సిపాలిటీ పరిధిలోని జగనన్న లేఔట్ నందు ఇంటి నిర్మాణం పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది
అందులో భాగంగా మంగళవారం నాడు స్థానిక మేజర్ లేఔట్ నందు కనిగిరి రెవెన్యూ డివిజన్ అధికారి సందీప్ కుమార్ గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ పవన్ కుమార్ పర్యటించి ఇంటి నిర్మాణం పనులను పరిశీలించారు.
అనంతరం స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ అధ్యక్షతనతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో సంపత్ కుమార్ మాట్లాడుతూ ఇంటి నిర్మాణం పనులు వేగవంతం చేసేందుకు సచివాలయల వారిగా ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించిన వారిని గుర్తించి వారితో మాట్లాడి ఇంటి నిర్మాణం పనులు వేగవంతం చేసేందుకు కృషి చేయాలని
ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ పవన్ కుమార్,మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ మరియు గృహ నిర్మాణ శాఖ, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు