హాబీబుల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కమిషనర్ కు సత్కారం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
జాతీయ ఉత్తమ నగర పంచాయితీ గా పొదిలి నగర పంచాయతీ ఉత్తమ అవార్డు అందుకున్న సందర్బంగా కమిషనర్ డానియల్ జోసెఫ్ ను హాబీబుల్లా స్వచ్చంద సేవా సంస్థ చైర్మన్ యం కరీముల్లా బేగ్ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదిలి నగర పంచాయతీలో ప్రతి వీధి, ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉండేలాగ చూడాలని, దోమల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్, మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ లకు విజ్ఞప్తి చేశారు.
ఈకార్యక్రమంలో హాబీబుల్లా సేవా సంస్థ సభ్యులు లాయర్ షబ్బీర్, రబ్బానీ, ముల్లా సంధానీ , షేక్ గౌస్,సిఐటీయు రమేష్ తదితరులు పాల్గొన్నారు.