ఫైనాన్స్ కంపెనీ వేధింపులకు తాళలేక వ్యక్తి ఆత్మహత్య యత్నం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఫైనాన్స్ కంపెనీ వేధింపులకు తాళలేక ఆటో డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్న సంఘటన గురువారం నాడు చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణం చెందిన షేక్ జిలానీ ఒంగోలు చెందిన ఆటో ఫైనాన్స్ కంపెనీ వద్ద ఆటోలకు ఫైనాన్స్ తీసుకోనున్నారని సదరు ఫైనాన్స్ కంపెనీ వారు తక్షణమే మొత్తం డబ్బులు చెల్లించాలని గత మూడు రోజులుగా తీవ్రంగా ఒత్తిడి చేయటంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం కు పాల్పడటంతో పురుగుల మందు తాగినా విషయాన్ని గుర్తించిన స్ధానికులు హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనం ద్వారా ఒంగోలుకు తరలించారు.
సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది