ఆయుర్వేద రత్న దరిశి శివాజీ కి సత్కారం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ధన్వంతరి జయంతి సందర్భంగా ఆయుర్వేద రత్న దరిశి శివాజీ ని ఘనంగా సత్కరించారు.
భారత ప్రధానమంత్రి ఆదేశాల మేరకు ఆయుష్ ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి ఆయుర్వేద దినోత్సవం వేడుకలు ఒంగోలు నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఆయుర్వేద రత్న దరిశి శివాజీ ను ఘనంగా సత్కరించారు