వ్యవసాయ మార్కెట్ కమిటీ బరిలో వెంకట రమణ
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కంభాలపాడు గ్రామానికి చెందిన మల్లపురం వెంకట రమణ ఆశిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ యస్సీ మహిళా కోటాకు రిజర్వేషన్ ఖరారు చేసిన నేపథ్యంలో పొదిలి నగర పంచాయితీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ యస్సీ విభాగం అధ్యక్షులు మల్లపురం నరసింహారావు తన సతీమణి వెంకట రమణ కు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కే విధంగా పావులు కదుపుతున్నారు.
పాత కంభాలపాడు పంచాయతీ కి చెందిన పార్టీ నాయకులు శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి కలిసి వెంకట రమణ కు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు.
తన సతీమణి వెంకట రమణ కు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరింస్తు మౌనం గా తన శైలిలో పావులు కదుపుతున్నారు.
శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి నెలాఖరులోగా ప్రక్రియ ను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారని పార్టీ వర్గాల సమాచారం.
పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో అనే విషయం మరో కొద్ది రోజులు ఆగాల్సిందే