యస్పీ చేతుల మీదుగా బహుమతి అందుకున్న పొదిలి విద్యార్థి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఒంగోలు యస్పీ కార్యలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా యస్పీ మలిక గార్గ్ చేతుల మీదుగా పొదిలి పట్టణం చెందిన కె పుష్ప బహుమతిని అందుకున్నారు.
వివరాల్లోకి వెళితే పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలో పోలీస్ సిబ్బందికి, వివిధ కళాశాలు, పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలగా నిలిచిన వారికి ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గారు బహుమతులను అందచేసినారు. పోలీస్ సిబ్బందికి “మహిళా భద్రతలో పోలీసుల పాత్ర” , విధ్యార్థులకు “మారుతున్న కాలంలో పోలీసుల పాత్ర” అనే అంశాలపై వ్యాస రచన పోటీలను నిర్వహించారు.
దర్శి సబ్ డివిజన్ పరిధిలో విజేతలు
ప్రథమ కెపుష్ప (ప్రభుత్వం ఉన్నత పాఠశాల, పొదిలి),
ద్వితీయ జి వి ఉమా మహేశ్వరి ( గౌతమి జూనియర్ కాలేజీ, దర్శి)
తృతీయ పి కావ్య (జిల్లా పరిషత్ హై స్కూల్, త్రిపురాంతకం).
ఈ సంధర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ 1959వ సంవత్సరం, అక్టోబర్ 21న సీఆర్పీఎఫ్ జవాన్లు భారత్, చైనా సరిహద్దుల్లో ఉన్న లడక్ ఆక్చాయ్చిన్ వద్ద చైనా సైనికులతో చివరి రక్తం బొట్టు వరకు పోరాడి దేశ కోసం అశువులు బాసారని, ఆ పోలీసు అమరులతో పాటు సమాజంలో పోలీసుల విధులు, త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరుల స్మారకోత్సవాలను జరుపుకుంటామని విజేతలకు తెలియజేసారు. ఈ వ్యాసరచన పోటీలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించామని, పోలీసు సిబ్బంది మరియు విద్యార్థులు ఈ వ్యాసరచన పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని అద్భుతంగా రాసారని విజేతలను అభినందించారు.
విద్యార్థులు మంచి అలవాట్లను పాటిస్తూ చక్కగా చదువుకోవాలని, చదువులతో పాటు మంచి క్రీడలు, చక్కటి హాబీస్ అలవర్చుకోవాలని, ఉత్తమ లక్ష్యాలను నిర్ధేశించుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, సమాజంలో నలుగురికి ఆదర్శంగా నిలిచి మంచి గుర్తింపు పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్ ) కె నాగేశ్వరరావు గారు, ఎఆర్ ఎ యస్పీ అశోక్ బాబు గారు, డిసిబి డియస్పీ బి మరియాదాసు, ఆర్ఐలు శ్రీహరి రెడ్డి, హరిబాబు, ఏఆర్ ఎస్సై లు మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.