ఆరామ క్షేత్రాన్ని కాపాడాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన విశ్వ బ్రాహ్మణ సంఘం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి పట్టణం శివాలయం దేవస్థానం ఎదురుగా ఉన్న ఆరామ క్షేత్రాన్ని కాపాడాలని కోరుతూ ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
సోమవారం నాడు ఒంగోలు లోని ప్రకాశం భవనం నందు జరిగిన స్పందన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు కలెక్టర్ దినేష్ కుమార్ దృష్టికి ఆరామ క్షేత్రం విషయం పై ఫిర్యాదు చేశారు
గతంలో అయ్యప్ప స్వామి పీఠం ముసుగులో ఆక్రమణకు ప్రయత్నం చేయగా అడ్డుకొన్నమని ఇటివల కొంత మరలా అయ్యప్ప స్వామి పీఠం ముసుగులో ఆక్రమణకు ప్రయత్నం లో ఉన్నారని తెలుపగా స్పందించినా కలెక్టర్ తక్షణమే నివేదిక ఇవ్వాలని తహశీల్దారు భాగ్యలక్ష్మిని ఆదేశించినట్లు విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు ఒక ప్రకటన లో తెలిపారు.
కలెక్టర్ ను కలిసిన వారిలో విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సామంతపూడి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి సుతారం శ్రీనివాసులు, జిల్లా నాయకులు పత్తిపాటి బాల బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు