ఉద్యోగుల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి తాలుకా నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
బుధవారం నాడు స్థానిక పొదిలి ఎన్జీవో భవన్ నందు జరిగిన సమావేశంలో నూతన పాలకవర్గ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల అధికారిగా ఒంగోలు తాలూకా ఎన్జీవో ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మంజేష్ ఎంపికచేశారు.
ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మంజేష్ మాట్లాడుతూ నవంబర్ 10వ తేదీ న ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నామినేషన్లను స్వీకరణ 2గంటల నుంచి 3గంటల వరకు పరిశీలన 3గంటల నుంచి 4 గంటల వరకు ఉపసంహరణ 4గంటలక తుది జాబితా ప్రకటన 20వ తేదిన పోలింగ్ జరుగుతుందని ఒక ప్రకటన లో తెలిపారు