ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి నగర పంచాయితీ పరిధిలోని కంభాలపాడు నందు ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కిన సంఘటన గురువారం నాడు చోటుచేసుకుంది.

గురువారం ఉదయం స్థానిక కంభాలపాడులోని ఒంగోలు -నంద్యాల రహదారిపై మహిళలు రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ గత నెల రోజులుగా నీటి సరఫరా చేయకపోవడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని తక్షణమే మంచి నీటి సరఫరా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

సాగర్ నీరు కూడా సరిగా రాకపోవడం త్రాగటానికి మంచినీటి కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడిందని తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు

విషయం తెలుసుకున్న పొదిలి యస్ఐ శ్రీహరి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని రాస్తారోకో చేస్తున్న మహిళలు తో మాట్లాడి వారికి నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు.

సుమారు గంటసేపు పైగా కొనసాగినా రాస్తారోకో వలన భారిగా నిలిచిన వాహనాలను పోలీసులు క్రమబద్ధీకరణ చేసారు.