పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

 

పొదిలి మండలంలోని కాటూరివారిపాలెం ,సూదనగుంట గ్రామల పరిధిలోని పంట పొలాలను దరిశి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పరిశీలించారు.

గురువారం నాడు స్థానిక మండలంలోని సూదనగుంట, కాటూరి వారి పాలెం రైతు భరోసా కేంద్రాల్లో పరిధిలోని రైతులు తో దరిశి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు భారతి, రాజేష్ చౌదరి లు మాట్లాడి వారి వేసిన పత్తి,కంది పంటలను పరిశీలించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిచాకారి చేయాల్సిన మందు మోతాదు గురించి మొదలైన అంశాలను గురించి రైతులకు అవగాహన కల్పించారు.

ఈ పర్యటనలో పొదిలి వ్యవసాయ శాఖ అధికారి షేక్ జైనులాబ్దిన్ మరియు రైతు భరోసా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు