చింతకాయల అయ్యన్న పాత్రుడు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన టీడీపీ నాయకులు

తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు మరియు మాజీ మంత్రివర్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు మరియు వారి కుమారుడు రాజేష్ లను రాష్ట్ర సిఐడి పోలీసులు అర్ధరాత్రి అక్రమ అరెస్టులను నిరసిస్తు తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలుకు నోచుకోవడం లేదని రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని గత మూడున్నర సంవత్సరంలలో రాష్ట్రంలో 30 మంది తెలుగుదేశం బిసి కార్యకర్తలు హత్యకు గురయ్యారని సుమారు 650 మందిపై వైసిపి గుండాలు దాడులు తెగ పడ్డారని అన్నారు.

గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేశారని ఇప్పటి వైసీపీ ప్రభుత్వం ఆ సంఖ్యను 24% కు తగ్గించిందని తద్వారా 18 వేలమంది బీసీలు పదవులు కోల్పోయారని రాష్ట్ర ప్రభుత్వం పదుల సంఖ్యలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కనీసం కార్పొరేషన్లకు ఒక పైసా అయినా కేటాయించడం లేదని తద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం నకు బీసీలపై ఉన్న కపట ప్రేమ అర్థమవుతుందని అన్నారు.

ఇకనైనా వైసీపీ నాయకులు బిసిలపై దాడులు ఆపాలని బిసి నాయకుడైన చింతకాయల అయ్యన్నపాత్రుడు గారిని అరెస్టు చేయడం యావత్తు బీసీ జాతిని అరెస్టు చేసినట్టేనని ఇకనైనా కళ్ళు తెరిచి ఆయన్ను విడుదల చేయాలని ప్రభుత్వానికి హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో పొదిలి పట్టణ అధ్యక్షులు ముల్లా ఖుద్దూస్, మండల పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, కొనకనమిట్ల మండలం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు,పొదిలి మాజీ జడ్పిటిసి సభ్యులు కాటూరి పెద్దబాబు, పొదిలి మాజీ సర్పంచ్ కాటూరి చినబాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పొల్ల నరసింహారావు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి ఎర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి,జిల్లా టిఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ బాషా, పట్టణ ప్రధాన కార్యదర్శి కాటూరి శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు శామంతపూడి నాగేశ్వరరావు,నుగ్గు పోలయ్య, బరిగే బాలయ్య, అంకాల రోశయ్య, రోళ్ళ శ్రీనివాసులు,బత్తిన ఓబయ్య, బొడ్డు సుబ్బయ్య ,వీర్ల శ్రీను,పొల్ల బ్రహ్మం, బ్రహ్మం చారి మరియు తెలుగుదేశం నాయకులు షేక్ మౌలాలి, షేక్ మస్తాన్ వలి, గోగినేని వెంకట్రావు, పుట్ట కొండలు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.