ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు అడ్డుకున్న పోలీసులు

 

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి: 

పొదిలి నగర పంచాయితీ పరిధిలోని పోలీసు స్టేషన్ సమీపంలో ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కిన సంఘటన శుక్రవారం నాడు చోటుచేసుకుంది.

స్థానిక పొదిలమ్మ నగర్ మహిళలు మంచి నీటి సరఫరా కొనసాగించాలని కోరుతూ ఒంగోలు -నంద్యాల రహదారిపై మహిళలు రాస్తారోకో తలపెట్టిన వెంటనే పొదిలి యస్ఐ శ్రీహరి సంఘటన స్థలానికి చేరుకొని రాస్తారోకో ను అడ్డుకున్నారు

రాస్తారోకో చేపట్టిన మహిళలు తో మున్సిపల్ అధికారులు చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అనంతరం నిలిచిన వాహనాలను పోలీసులు క్రమబద్ధీకరణ చేసారు.