కోళ్ళ పందాల శిబిరం పై పోలీసులు దాడి

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

కొనకనమిట్ల మండలం పెద్ద అరికట్ల గ్రామంలో కోడిపందాల శిబిరం పై పోలీసులు దాడి చేసిన సంఘటన ఆదివారం నాడు చోటుచేసుకుంది.

రాబడిని సమాచారం ప్రకారం మేరకు కోడి పందాల శిబిరం పై దాడి చేసి 9 మంది వ్యక్తులను 9 ద్విచక్ర వాహనాలు 9140 రూపాయలు నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు కొనకనమిట్ల యస్ఐ ఫణికుమార్ సామాజిక మాధ్యమం ద్వారా ఒక ప్రకటనలో తెలిపారు.