మురళీధర్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నూకసాని బాలాజీ యాదవ్ డిమాండ్

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

మురళీధర్ కమిషన్ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నూకసాని బాలాజీ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మంగళవారం నాడు స్థానిక విశ్వనాధపురం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు 10శాతం ఈ బిసి రిజర్వేషన్లు లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా 50 శాతం రిజర్వేషన్లు పరిధి తొలిగిపోయిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1986 సంవత్సరంలో మురళీధర్ కమిషనర్ సిఫార్సు ఆధారం గా బిసిలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శాసనసభ తీర్మానం చేసి జివో జారీ చేసిందని దానిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 50శాతం రిజర్వేషన్లు పరిధి మించిన కారణంగా 44శాతం రిజర్వేషన్లు కోర్టు కొట్టివేసిందని అన్నారు.

ప్రస్తుతం సుప్రీంకోర్టు 50శాతం పరిధి మించి మరో 10 శాతం రిజర్వేషన్లుకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మురళీధర్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి బిసిలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

త్వరలో ఈ విషయం పై తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు దృష్టికి తీసుకొని వెళ్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొనకనమిట్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ మాజీ సర్పంచ్ వీర్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు