లైంగిక వేదింపులు పాల్పడినట్లు ఆరోపణలు పై పాఠశాల ముట్టడి రాస్తారోకో
పొదిలి మండలం కంభాలపాడు గ్రామంలోని మండల పరిషత్ పాఠశాల నందు చిన్నారులను లైంగిక వేదింపుల పాల్పడినట్లు ఆరోపిస్తు బుధవారం నాడు జిల్లా విద్యాశాఖ అధికారి కి ఫిర్యాదు చేసి గురువారం నాడు పాఠశాలను ముట్టించి ఆందోళన నిర్వహించారు
సదరు విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి పాఠశాల చేరుకొని విద్యార్థి తల్లిదండ్రులతో మరియు ఉపాధ్యాయుడు రవికుమార్ లను విచారించారు.
అనంతరం స్థానికులు ఒంగోలు – నంద్యాల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
విషయం తెలుసుకున్న పొదిలి యస్ఐ శ్రీహరి సంఘటన స్థలానికి చేరుకొని రాస్తారోకో ను విరమింపజేశారు.
సదరు పాఠశాలకు పొదిలి సిఐ సుధాకర్ రావు చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులు తో మాట్లాడి వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని తెలిపారు.