ఎన్ జి ఓ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి తాలుకా ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు గా నారు శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి గా షేక్ నాగూర్ వలి,అసోసియేట్ అధ్యక్షులు గా షేక్ రహీం,ఉపాధ్యక్షులు గా షేక్ కరీముల్లా, షేక్ అబ్దుల్ జలీల్, షేక్ అబ్దుల్ ఆరీఫ్,కె. వెంకటేశ్వర్లు,సంయుక్త కార్యదర్శులు గా సి హెచ్ వెంకటేశ్వర్లు, జి. వెంకట్రావు,పి విజయశేఖర్,కె శివశంకర్ రెడ్డి, కె విజయ,కోశాధికారి గా షేక్ సందాని బాషా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మంజేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

అనంతరం నూతన కార్యవర్గాన్ని ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా అధ్యక్షులు కూచిపూడి శరత్ బాబు అభినందించారు.