మౌళిక సదుపాయాల కల్పన చేసి ఇంటి నిర్మాణ బిల్లు సకాలంలో చెల్లించాలి

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

మార్కాపురం నియోజకవర్గం జనసేన పార్టీ బాధ్యులు ఇమ్మడి కాశీనాధ్

జగనన్న ఇల్లు – పేదలందరికీ కన్నీళ్లు జనసేన పార్టీ సామూహిక పరిశీలనా కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు స్థానిక పొదిలి లోని జగనన్న లేఔట్ నందు మార్కాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నియోజకవర్గ బాధ్యులు ఇమ్మడి కాశీనాధ్ పర్యటించి మౌళిక సదుపాయాలను ఇంటి నిర్మాణం పనులను మరియు ప్రభుత్వ సరఫరా చేస్తున్న ఇసుక ను పరిశీలించారు

స్ధానికంగా ఉన్న కొంత మంది లబ్ధిదారులు మరియు కాంట్రాక్టర్లు తో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కాశీనాధ్ మాట్లాడుతూ తక్షణమే లబ్దిదారులకు పెండింగ్ బిల్లులు చెల్లింపులు చెయ్యాలని లేఔట్ నందు మౌళిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రైవేటు కంపెనీలతో ఇంటి నిర్మాణం పనులు అంటే నాసిరకం పనులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందని ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పన చేసి సకాలంలో నగదు చెల్లింపుల చేస్తే ప్రజలే ఇంటి నిర్మాణం చేసుకుంటారని ఆయన అన్నారు.

కేవలం పవన్ కళ్యాణ్ హెచ్చరికల నేపథ్యంలో హడావుడిగా ప్రైవేటు కంపెనీలను రంగంలోకి దించారని అన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు