జాతీయ లోక్ అదాలత్ లో 528 కేసులు రాజీ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా పొదిలి మండల న్యాయ సేవాధికారసంస్ధ జూనియర్ సివిల్ కోర్టు ఆధ్వర్యంలో 528 కేసులు రాజీ జరిగాయి.

స్ధానిక జూనియర్ సివిల్ కోర్టు నందు శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో క్రిమినల్ కేసులు – 198, డివిసి కేసులు – 02 యన్ ఐ యాక్ట్ కేసులు – 02, యస్టీయస్ కేసులు 300 బ్యాంకు పియల్సీ కేసులు 20 మొత్తం – 528 కేసులు పరిష్కారం అవ్వగా 32లక్షల 80వేల రూపాయలు పరిహారం ఇప్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి భార్గవి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ లో కేసులు రాజీ చేసుకోవటం ద్వారా సమయం మరియు డబ్బు ఆదా అవుతాయని గ్రామాలలో శాంతి ఉన్నప్పుడే దేశం అబివృద్ది చెందుతుందని మరియు బంధాలు పెంపొందుతాయని కావున కక్షిదారులు తమ కేసులు రాజీ చేసుకోవడానికి లోక్ అదాలత్ మంచి అవకాశమని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐ సుధాకర్ రావు న్యాయవాదులు, పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి, తాడివారిపల్లి యస్ఐ లు, ఎస్ బి ఐ మేనేజర్, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.