పిడియఫ్ అభ్యర్థులను గెలిపించాలి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఉద్యోగ ఉపాధ్యాయ పట్టభద్రులు వైపు పనిచేసే, ప్రభుత్వాని ప్రశ్నించేందుకు ప్రజల గొంతుగా పనిచేసే పిడిఎఫ్ బలపరిచిన తూర్పు రాయలసీమ (చిత్తూరు నెల్లూరు ప్రకాశం) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పోక్కిరెడ్డి బాబు రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డి లను గెలిపించాలని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీ బాల వెంకటేశ్వర్లు అన్నారు.
పెమ్మని బాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథి హాజరైన పి బాబు రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య వైద్యము రంగాల్లో ప్రపంచ బ్యాంకు షరతులకు తలవగి అనేక కొత్త జీవోలను తీసుకువచ్చి విద్య వైద్య రంగాన్ని ,నిర్వీర్యం చేస్తుంది అన్నారు
సాల్ట్ ఒప్పందం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43 వేల పాఠశాలనుగా11వేల పాఠశాలు కుదించడం, విద్య శాఖ బడ్జెట్ 30 వేల కోట్ల నుండి పదివేల కోట్లకు కుదించుకోవడం, ఇప్పుడు ఉన్న రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఖ్య ఒక లక్ష ₹80,000 మంది ఉపాధ్యాయులను ఒక లక్షలోపు కుదించుకోవడం , అనగా సుమారు 56వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేయడం జరుగుతుందని అన్నారు
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల దాచుకున్న పిఎఫ్, APGLI,డిఎ బకాయిలు మెడికల్ రియంబర్స్మెంట్ , సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్, గ్రాడ్యుటి మొదలగు బకాయిలు సుమారు 1800 కోట్ల రూపాయలు ఉన్నాయి వెంటనే విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటన చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని, మెగా డీఎస్సీ వెంటనే ప్రకటించాలని,దశలవాదిగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులను రెగ్యులర్చేసి టైమ్ స్కేల్ ఇవ్వాలని అన్నారు.
పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని అన్నారు
జిపిఎస్ నుఎలాంటి సందర్భంలో ఒప్పుకోమని అన్నారు కచ్చితంగా పాత పెన్షన్ పునరుద్ధరించాలని అన్నారు వెంటనే ఉపాధ్యాయుల బదిలీల జీవోను విడుదల చేయాలని అన్నారు 30 వేల ప్రమోషన్లు కల్పించాలని అన్నారు .
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఓ వీరారెడ్డి రాష్ట్ర కౌన్సిలర్ పి రమణారెడ్డి, జిల్లా కార్యదర్శి షేక్ అబ్దుల్ హై ,పెన్షనర్స్ తాలూకా అధ్యక్షులు ఏ బాదుల్లా, గౌరవ అధ్యక్షులు నరసింహారావు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు బి బుజ్జి బాబు, చవలం వెంకటేశ్వర్లు, యుటియఫ్ పొదిలి కొనకనమిట్ల మర్రిపూడి మండలాల మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి బాలకాశి రెడ్డి ,నాగార్జున గోనే శ్రీనివాసులు, బి కృపారావు సిహెచ్ కోటేశ్వరరావు ఒప్పంద ఉద్యోగుల సంఘం కె లక్ష్మీనారాయణ ప్రధాన ఉపాధ్యాయులు రెబ్బ వెంకటేశ్వర్లు, బెల్లంకొండ శ్రీనివాసరావు, కేజే మోహన్ రావు, మదార్ వలి ,పోలు శ్రీ నివాసులు రెడ్డి, కాసు తిరుపతి రెడ్డి,సోమ రాజు, సింగంపల్లి సుబ్బారావు, సంజీవరావు వెన్నెల మల్లికార్జునరావు ఆవులప్రసాద్, రామయ్య ,చావలి మురళి, జిలాని భాష, డి కోటేశ్వరరావు, వేమూరి శ్రీనివాసులు, చిత్తంశెట్టి సుబ్బారావు, బి శ్రీనివాసరెడ్డి, ఓబుల్ రెడ్డి, ఏడుకొండలు, శేషు, సత్యనారాయణ రెడ్డి, నారాయణరెడ్డి, చిలక మోహన్, సీతారామయ్య విజయగోపాల్, అనిశెట్టి ఆంజనేయులు వై గురవయ్య తదితరులు పాల్గొన్నారు