ఘనంగా బాలలు దినోత్సవం వేడుకలు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి కొనకనమిట్ల మండలాల్లో ఘనంగా బాలలు దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి.
భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని జాతీయ బాలలు దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ అందులో భాగంగా సోమవారం నాడు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ బాలల దినోత్సవం వేడుకలు నిర్వహించి విద్యార్థులకు నెహ్రూ చిత్రపటాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ప్రిన్సిపాల్ రాజేంద్ర, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ సొంగా కొండాలరావు , కంభాపాటి శివసాయినాద్,పతాకమురి బాలకృష్ణ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
భవిత పాఠశాల బాలలు దినోత్సవం వేడుకలు
భారత జాతీయ బాలల దినోత్సవం వేడుకలు స్థానిక భవిత పాఠశాల నందు ఘనంగా జరిగాయి.
పొదిలి పట్టణం ఇస్లాంపేటకు చెందిన చిన్నారి కమ్రాన్ అక్మల్ జన్మదిన సందర్భంగా వారి తల్లిదండ్రులు భవిత పాఠశాల నందు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు.
ఈ కార్యక్రమంలో భవిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల కృష్ణ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు