మూడు రోజుల్లో పందుల పెంపకం కేంద్రాలు తొలగించాలని కమీషన్ ఆదేశాలు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పందుల పెంపకం దారులతో మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ సమావేశం నిర్వహించి వారికి నోటీసులు జారీ చేసారు.

సోమవారం నాడు స్థానిక పొదిలి మున్సిపల్ కార్యాలయంలో నందు పందుల పెంపకం దారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో పందుల పెంపకం నిషేధం కావున మీకు నోటీసు పేర్కొన్నా విధంగా మూడు రోజుల తర్వాత మున్సిపల్ పరిధిలో పందులు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు తదితరులు పాల్గొన్నారు